Breaking News

కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు.. అరెస్ట్‌కు రంగం సిద్దం?

Published on Sun, 06/21/2026 - 10:55

సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సంబంధించిన పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఆయన గత మూడు రోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు అరెస్ట్‌కు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

అయితే, సీఐ నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, సాయికృష్ణ కేసులో టాస్క్‌ఫోర్స్ అధికారులు లత కుమారి, సీఐ శ్రీధర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీసు అధికారి.. కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాశ్‌, సభ్యులుగా పశ్చిమగోదావరి, అల్లూరి జిల్లా, బాటప్ల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. మరోవైపు.. ఈ కేసులో రెండు రోజుల నుంచి దర్యాప్తు బృందాలు టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక స్టేషన్‌ సిబ్బందిని విచారిస్తున్నారు. వీరి నుంచి స్టేట్‌మెంట్ల రూపంలో వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఏసీపీ దైవప్రసాద్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం శనివారం కూడా కృష్ణలంక స్టేషన్‌లో స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)