Breaking News

‘నాటా’ అవార్డు ఇన్‌ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక 

Published on Thu, 06/29/2023 - 08:19

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉత్తర అమెరి­కా తెలుగు సమితి (నాటా) అవార్డు ఇన్‌ జర్నలిజం–2023కు ఆంధ్రప్రదేశ్‌ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్‌ నగరంలో డల్లాస్‌ కన్వెక్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసి­న అనుభవం, కేఎస్‌ఆర్‌ లైవ్‌ షో పేరుతో తెలుగు రాష్ట్రా­ల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలి­జం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

నాటా” ఆహ్వానం మేరకు సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు ఈ నెల 29న (గురువారం) పయనమౌతున్నారు.  ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యం లో ఏటా జరిగే తెలుగు ప్రజల  ఉత్సవాలను యీ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో  నిర్వహిస్తున్నారు.  జూన్ 30 నుండి జులై 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.  తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను సన్మానించడం జరుగుతుంది. 

2023 సంవత్సర "నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్స్ లెన్స్" అవార్డును   అందుకునేందుకు శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు జులై 1 నాటికి చేరుకుంటారు. తిరిగి జులై 16న విజయవాడ చేరుకుంటారు.

ఇది కూడా చదవండి: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Videos

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)