Breaking News

ఎమ్మెల్యే కామినేని ఓవరాక్షన్‌.. షాకిచ్చిన కొల్లేరువాసులు

Published on Thu, 01/22/2026 - 20:36

సాక్షి, ఏలూరు: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే కామినేనిపై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కామినేని శ్రీనివాస్‌ను ప్రజలు నిలదీశారు. దీంతో, అసహనానికి గురైన ఎమ్మెల్యే.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వివరాల మేరకు.. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరు స్థానికులకే ఇచ్చేస్తామని కామినేని శ్రీనివాస్‌, కూటమి నేతలు.. స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తాజాగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లడంతో స్థానికులు హామీ విషయమై నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కామినేనితో స్థానికులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఏం చేశారంటూ కామినేనిని కొల్లేరు వాసులు నిలదీశారు. 

ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బంది పడలేదని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు. అనంతరం, చెరువుల విషయంలో కామినేనిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కొల్లేరు వాసులపై అసహనం వ్యక్తం చేశారు. నేను పట్టించుకోను ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.. ఓవరాక్షన్‌ చేశారు. నోరు మూయండి అంటూ కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా మాట్లాడటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)