Breaking News

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్‌ యత్నం కేసు

Published on Sat, 02/04/2023 - 08:39

నెల్లూరు (క్రైమ్‌): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూలే విజయభాస్కర్‌ రెడ్డికి శుక్రవారం ఫోన్‌ చేసి వైఎస్సార్‌సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్‌ రెడ్డి నిరాకరించడంతో.. 

ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్‌ అంకయ్యతో కలిసి కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయ­పాలెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తెలిపారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)