Breaking News

విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు 

Published on Fri, 11/24/2023 - 05:50

సాక్షి, అమరావతి: విశాఖపట్నం నుంచి పరిపాలనకు కీలక అడుగు పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమతుల అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర జి­ల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు, పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ అధికారులు ఆ జిల్లాల్లో పర్యటించడంతో పాటు విశాఖపట్నంలో రాత్రి పూ­ట బస చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మంత్రులు, సచివాలయాల శాఖలు, సీనియర్‌ అధికారుల­కు కార్యాలయాల వసతిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖలో మంత్రులు, సచివా­ల­య, వివిధ శాఖాధిపతుల కార్యాలయా­లు, క్యాంపు కార్యాలయాలకు భవనాలను గు­ర్తిం­చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమి­టీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మంత్రులు, సచివా­లయ శాఖల కార్యాలయాల వస­­­­తికి  ప్రభుత్వ భవనాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్ర­భుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, సీనియర్‌ అధికారుల సమీ­క్ష సమావేశాలకు రుషి­కొండలోని మిలీనియం టవ­ర్స్‌ ఎ, బిని క్యాంపు  కా­ర్యా­లయాలుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా­రు. సొంత భవనాల్లేని ప్రధాన శాఖలకు కూడా ఈ టవర్లలో వసతి కేటాయించనున్నట్లు తెలిపారు. 

ఇ­క్కడ 1.75 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా శాఖలకు నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాల్లో మొత్తం 2.27 లక్షల చదరపు అడుగులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మొత్తం 35 శాఖల్లో 16 శాఖలకు మాత్రమే ప్రస్తుతానికి విశాఖలో వసతి కేటాయించారు. వీటికి ఎండాడ, హనుమంతవాక, దయాళ్‌ నగర్, మహారాణి పేట, కంచరపాలెం, దు­ర్గానగర్, రాంనగర్, ఎంవిపీ కాలనీ, పెందుర్తి, మద్ది­ల­పాలెం, సిరిపురం సర్కిల్, భీమునిపట్నం, మర్రి­పా­లెం, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతాల్లో భవనా­లు కేటాయించారు.

మిగతా 19 శాఖలకు భవనాల­ను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఆర్‌టీజీఎస్, సాంఘిక సంక్షేమం, ఆర్థిక, సాధారణ పరిపాలన, గ్రామ, వార్డు సచివాయాలు, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఐటీ, కార్మిక, న్యా­య, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలకు వస­తి గుర్తించాల్సి ఉందన్నారు. ఏ శాఖకైనా విశాఖలో సొంత భవనాలు ఉంటే వాటిలో కార్యాలయా­ల ఏ­ర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

సీని­యర్‌ అధికారుల గృహ వసతి కోసం ముందుగా సొంత భవనాలను వినియోగించుకోవాలని సూ­చించారు. మిలీనియం టవర్లలో వసతి కేటాయింపులపై ఐటీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర్వులకు అనుగుణంగా సచివాలయానికి సంబంధించిన అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)