Breaking News

జిల్లా జడ్జీల సీనియారిటీలో పారదర్శకతకు మార్గం

Published on Sun, 09/28/2025 - 05:31

సాక్షి,అమరావతి:  రాష్ట్రంలో జిల్లా జడ్జీల అంతర్గత సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015 సంవత్సరానికిగాను  2022 జనవరి 5న జారీ చేసిన సీనియారిటీ జాబితాను  రద్దు చేసింది. 10 శాతం బదిలీ ద్వారా వేగవంతమైన నియామక కోటా (యాక్సిలిరేటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ కోటా) కింద నియమితులైన పిటిషనర్లు, 65 శాతం పదోన్నతి కోటా కింద నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను తయారు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. 

ఇందుకు నాలుగు నెలల సమయమిచ్చింది.   అప్పటి  వరకు 2022 జనవరి 5 నాటి సీనియారిటీ జాబితా ఆధారంగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సవరించిన సీనియారిటీ జాబితా ప్రచురితమైన తరువాత పదోన్నతులను చట్ట ప్రకారం చేపట్టాలంది.  తాజా సీనియారిటీ జాబితాను తయారు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీస్‌ రూల్స్‌ 2007లోని రూల్‌ 13(ఏ)లోని రోస్టర్‌ పాయింట్లను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. 

2017 ఫిబ్రవరి 4న ఉమ్మడి హైకోర్టు తయారు చేసిన సీనియారిటీ జాబితాను దృష్టిలో పెట్టుకుని తాజా సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని తేల్చి చెపింది.  ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ కుంచెం మహేశ్వర­రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.  

కొన్ని ముఖ్యాంశాలు..
»  2015 సంవత్సరానికి జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా 2022 జనవరి 5న జారీ అయింది. ఈ జాబితాలో రెండు వేర్వేరు కోటాల ద్వారా నియ­మితులు ఉన్నారు. 10  శాతం కోటా వేగవంతమైన నియామకం (డైరెక్ట్‌ రిక్రూట్‌)కాగా, 65 శాతం పదోన్నతి కోటా (సబ్‌ ఆర్డినేట్‌ జడ్జీల నుండి) కింద నియమితులైనవారు. 

»    రెండు కోటాల నియామక ఉత్తర్వులు వేర్వేరు తేదీలలో (65 శాతం కోటా 20–1–2016, 10 శాతం కోటా 8–2–2016) జారీ అయ్యాయి. 

»  ఈ ఆలస్యం కారణంగా 10 శాతం కోటా ద్వారా నియమితులను 65 శాతం కోటా నియమితుల కంటే జూనియర్స్‌గా పరిగణించడం జరుగుతుంది. రోస్టర్‌ పాయింట్ల ద్వారా సీనియారిటీ నిర్ణయం చేపట్టాలని సూచిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీస్‌ రూల్స్, 2007లోని రూల్‌ 13(ఏ)ను ‘రద్దయిన జాబితా’ ఉల్లంఘిస్తోందని, నిజమైన సీనియారిటీ క్రమానికి ఇది విరుద్ధమని పేర్కొంటూ న్యాయాధికారులు గుండూరి రజని, జి.అన్వర్‌ బాషా, పి.భాస్కర్‌ రావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలను విన్న హైకోర్టు తాజాగా సీనియారిటీ జాబితా సవరణకు ఆదేశాలు ఇచ్చింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)