Breaking News

ఉచిత బస్‌.. కేటాయింపులు తుస్‌

Published on Tue, 11/12/2024 - 04:14

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను తుంగలో తొక్కే చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డ్‌ను మరోసారి కొనసాగిస్తున్నారనే విషయాన్ని టీడీపీ కూటమి సోమవారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తొలి బడ్జెట్‌ తేటతెల్లం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ గురించి కనీసం ప్రస్తావించకపోవడం ద్వారా మరోసారి ప్రజలను సర్కారు వంచించింది. ఆ హామీని ఈ ఏడాదికి అటకెక్కించేసినట్టేనని తేల్చిచెప్పింది.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఆ హామీపై మౌనవ్రతం పాటిస్తున్నారు. వచ్చే మార్చిలోగా అమలు చేస్తారేమో అనుకుంటే.. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించలేదు. అధికారంలోకి వచ్చిన  ఐదు నెలల అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉచిత ప్రయాణం పథకం ప్రస్తావనే లేకుండా చేశారు.

మహిళలకు ఈ ఏడాది రూ.3,500 కోట్ల నష్టం
ఉచిత బస్‌ ప్రయాణం పథకంపై ప్రభుత్వం దాటవేత వైఖరితో రాష్ట్రంలోని మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా. కేవలం మహిళల నుంచే టికెట్ల ద్వారా నెలకు రూ.350 కోట్ల రాబడి వస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రూ.350 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.

బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవ­డంతో మహిళలు బస్‌ ప్రయాణం రూపంలో ప్రతి నెలా రూ.350 కోట్లు నష్టపో­తున్నారు. ఆ ప్రకారం ఇప్పటికే రాష్ట్ర మహిళలు రూ.1,750 కోట్లు నష్టపో­యారు. ఏడాది మార్చి వరకు ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకం ప్రస్తా­వనే లేదు. అంటే కనీసం మరో 5 నెలలు మరో రూ.1,750 కోట్లు మహిళలు నష్టపోవడం ఖాయమని తేలిపోయింది. వెరసి 2024–24 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర మహిళలు రూ.3,500 కోట్లను రాష్ట్ర మహిళలు నష్టపోయినట్టే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)