Breaking News

కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

Published on Tue, 07/01/2025 - 04:34

సాక్షి, అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదే­శాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రిలోని సర్వే నంబర్‌ 639, 640, 641లలో 577.55 చదరపు గజాల స్థలంలో తాము నిర్మించుకున్న ఇంటిని కాల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు యత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి సోమవారం  హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కామిరెడ్డి నవీన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్‌ ఇంటిని నిర్మించారని నవీన్‌ తెలిపారు. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారని తెలిపారు. జూన్‌ 21న అధికారులు సర్వే నిమిత్తం నోటీసులు జారీ చేసి, 28న సర్వేకు హాజరుకావాలని చెప్పారన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. సర్వే కోసం పిటిషనర్‌ భర్త తాడిపత్రి వెళ్లారని, అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకుని వెనక్కి పంపారని తెలిపారు.

అధికారులు 28న ఇంటికి వచ్చి మార్కింగ్‌ చేసి ఇంటి కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిందన్నారు. పురపాలకశాఖ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని, ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని, పిటిషనర్‌ ఇంటిని కూల్చొద్దని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)