Breaking News

అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలి

Published on Sun, 11/23/2025 - 11:11

విజయవాడ: కేరళలోని శబరిమల పంపానదితోపాటు చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో మెదడును తినే అమీబా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్న దృష్ట్యా జిల్లా నుంచి కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఎనీ్టఆర్‌ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాచర్ల సుహాసిని శనివారం సూచించారు. పంపానది, చుట్టుపక్కల సరస్సులు, జలాశయాల్లో స్నానము ఆచరిస్తే ‘మెదడు తినే అమీబా’ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిని బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా అని పిలుస్తారని తెలిపారు.  ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. కేవలం జలాశయాలు, నదుల్లో స్నానం చేసినప్పుడు ముక్కు, నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించి అమీబిక్‌ మీనింగో ఎన్‌ సఫిలిటీస్‌ అనే రక్తాక్రమ వ్యాధి రావడానికి కారణమవుతుందన్నారు. ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదన్నారు.  

ఐదు రోజుల్లో ప్రభావం.. 
ఈ మెదడు తినే అమీబా సోకిన వారిలో ఐదు రోజుల తర్వాత  తీవ్రమైన తలనొప్పి, జ్వరం, ముక్కులో శ్వాసకు ఆటంకం ఏర్పడటం,  వాంతులు, మెడనొప్పి, మెడ భాగంలో మంట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డీఎంహెచ్‌వో తెలిపారు. నిర్లక్ష్యం     చేస్తే బాధితులు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.  

జాగ్రత్తలు ఇలా.. 
నదులు, జలాశయాల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు, నోరు మూసుకోవాలి. నోటిలోకి నీరు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. కేరళ వెళ్లే పర్యాటకులు, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌వో సుహాసిని సూచించారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)