Breaking News

‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’

Published on Fri, 06/09/2023 - 09:04

సాక్షి,ఏలూరు టూ టౌన్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈనాడు’ వేస్టు పేపర్‌లా, టిష్యూ పేపర్‌లా మారిందని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అప్పులు, వేల కోట్లు దారి మళ్లింపుపై ఎందుకు రాయలేదని నిలదీశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పౌర సరఫరాల శాఖలో మార్పులు చేశారని, రైతులకు మేలు చేసేలా ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్ల పాత్ర లేకుండా చేశారని తెలిపారు. రవాణా, గోనె సంచులు, హమాలీ చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇటీవలి రబీ సీజన్‌లో ధాన్యంలో నూక శాతం ఎక్కువగా వచ్చినా ఒక్క రూపాయి కూడా కోత లేకుండా రైతులకు మద్దతు ధర మొత్తం చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. రబీలో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, రూ.28,402 కోట్ల విలువైన 15 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నామని తెలిపారు.

అందులో ఇప్పటివరకు రైతులకు రూ.28,200 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.200 కోట్లు సమయంలోగా చెల్లిస్తామన్నారు. జయ బొండాలు ధాన్యాన్ని కేరళ ప్రభుత్వం కోరిక మేరకు మన రైతులు పండించారని, దానిని ప్రైవేట్‌ వ్యాపారులు మద్దతు ధరకు కొన్నారని, దీనివల్ల లక్ష్య సాధన తగ్గిందన్నారు. ‘మార్గదర్శి’లో వేల కోట్లు దారి మళ్లించారని, దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌ అధి­కారం చేపట్టడం ఖాయమని చెప్పారు.

చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)