Breaking News

లోకేశ్‌ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు

Published on Sat, 10/18/2025 - 05:17

సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్‌ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్‌ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలా­మంది ఎక్స్‌ వేదికగా పంచుకుంటున్నారు. 

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసే­ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా లోకేశ్‌ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఎక్స్‌ వేదికగా నిలదీశారు. 

ఏపీకి గూగుల్‌ డేటా సెంటర్‌ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారి­పోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్‌ గురువారం ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.

గతంలోనూ ఇదే తీరు 
బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్‌ పోస్టు చేస్తే ప్రియాంక్‌ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్‌ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. 

మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం 
ప్రియాంక్‌ ఖర్గే ఏం ట్వీట్‌ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపు­ణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్‌ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు.  

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)