Breaking News

కర్ణాటక ‘ఎత్తు’పొడుపు.. నోరుమెదపని ఆంధ్ర!

Published on Sun, 10/26/2025 - 05:29

సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 16న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 75,563 ఎకరాల భూసే­కరణ.. 20 గ్రామాలతోపాటు బాగల్‌కోట మున్సి­పాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్ప­నకు 6,467 ఎకరాలు.. 5.94 లక్షల హెక్టార్లకు నీళ్లందించడానికి వీలుగా కాలువల తవ్వకానికి 51,837 ఎకరాలు వెరసి 1,33,867 ఎకరాల సేకరణకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేస్తూ ఈనెల 9న కర్ణాటక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎకరం మగాణి భూమికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి రూ.30 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఏటా రూ.18 వేల కోట్ల చొప్పున వ్యయం చేసి నాలుగేళ్లలోగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా ఆల్మట్టి డ్యాం గరిష్ఠ నీటి మట్టాన్ని 519.6 మీటర్లు(129.72 టీఎంసీలు) నుంచి 524.256 మీటర్లు(279.72 టీఎంసీల)కు పెంచే ప్రక్రిను పూర్తి చేస్తామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 1996–2003 మధ్య ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు కర్ణాటక సర్కార్‌ పెంచేసింది. 

2003–04 ముందు వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్‌ నాలుగో వారంలోనే ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చేది. కానీ.. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకు పెంచడంతో శ్రీశైలానికి వరద జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఉదాహరణకు 2015–16లో కృష్ణా నుంచి శ్రీశైలానికి కేవలం 24.97 టీఎంసీలే వచ్చాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే.. నీటి నిల్వ మరో వంద టీఎంసీలు పెరుగుతుంది. 

అదనంగా 5.94 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే వ్యవస్థ కర్ణాటకకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆల్మట్టిలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా కర్ణాటక సర్కార్‌ ఆయకట్టుకు తరలిస్తుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి కృష్ణా వరద వచ్చే అవకాశమే ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. 

అయినా సరే చంద్రబాబు సర్కార్‌ 1996–2003 తరహాలోనే ఇప్పుడు మొద్దునిద్ర పోతోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్‌ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇప్పటికే స్పష్టం చేసినా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)