Breaking News

చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేకే ఆత్మహత్యలు

Published on Sun, 06/07/2026 - 04:59

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పెట్టే టార్చర్‌ భరించలేక కర్నూలు  జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి శనివారం ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్సేన్‌ అనే సచివాలయ ఉద్యోగి సర్జరీ అయింది... సెన్సస్‌ డ్యూటీ వల్ల తిరగలేక బాధ పడుతున్నా... మళ్లీ ఇంటింటికీ తిరిగి పని చేయలేను అని ఎంత వేడుకున్నా వినకుండా బీఎల్‌వో డ్యూటీ వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్సుల గోలకు తోడు సర్వేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు క్షోభకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు నలుగురు ఒత్తిడి తట్టుకోలేక  ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మరణించారు’ అని  పేర్కొన్నారు.  

హామీలేమయ్యాయి చంద్రబాబూ..? 
‘ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను ఒకటే అడగదల్చుకున్నా. అయ్యా! ఉద్యోగులంతా ఎగబడి మీకు ఓటు వేసింది మీ చేతిలో ఇలా బలి అవడానికా? మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడా నికా..? ఆత్మహత్యలు చేసుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవం పెంపొందిస్తామన్నారు.

ఇదేనా ఉద్యోగులకు మీరు కల్పించే అనుకూలమైన పని వాతావరణం! ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పని వాతావరణం అంటే? ఆర్థికపరమైన హామీలు ఎలాగూ అమలు చేయలేదు. కనీసం ఇలాంటి హామీలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసే చర్యలు ఆపాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. సచివాలయ ఉద్యోగులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు.   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?