Breaking News

భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!

Published on Sun, 07/20/2025 - 11:05

కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్‌లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. 

చాపాడు మండలం  చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్‌ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా ఉంటున్న గోపాల్‌ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్‌ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. 

అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్‌కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్‌ తన భార్యను గొంతు నులిమి  చంపేశాడు.  ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్‌ గోనే సంచిలో కట్టుకుని తన బైక్‌లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.

గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్‌ సీఐ శివశంకర్, ఎస్‌ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్‌ సీఐ, ఎస్‌ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ తెలిపారు.  

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు