Breaking News

పల్లె నుంచి.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు పూర్ణిమ

Published on Wed, 06/11/2025 - 09:56

కడప సెవెన్‌రోడ్స్‌ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్‌బర్గ్‌ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రవిశంకర్‌ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్‌ హైసూ్కల్,  4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, ఇంటర్మీడియేట్‌ హైదరాబాద్‌ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్‌ స్కూల్‌లోనూ చదివారు. 

ఆ తర్వాత పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్‌) చేశారు. అనంతరం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఎడెన్‌బర్గ్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌ మేథమ్యాటికల్‌ ఎకనామిక్స్‌ అండ్‌ ఎకనామెట్రిక్స్‌కు దరఖాస్తు చేశారు. ఎడెన్‌బర్గ్‌ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్‌ పొందాలని సమాచారం పంపింది. 

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌ 2025లో ఎడెన్‌బర్గ్‌ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్‌ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్‌ కారత్, ఓలివర్‌ గోల్డ్‌స్మిత్, డేవిడ్‌ హ్యూమ్, వాల్టర్‌ స్కాట్‌ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే ఐఈఎల్‌టీఎస్‌లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్‌బర్గ్‌ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు. 

అంతేగాక యూకేలోని బ్రిష్టల్‌ యూనివర్శిటీలోనూ ఎంఎస్‌లో ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ మేథమ్యాటిక్స్‌లోనూ, లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో ఫైనాన్షియల్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ మేథమ్యాటిక్స్‌ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)