Breaking News

సీఐ, ఎస్‌ఐ ఓవరాక్షన్‌.. గోవింద మాల భక్తుడిపై దాడి

Published on Sun, 12/07/2025 - 08:09

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడపలో ట్రాఫిక్‌ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయిల్‌ సప్లయ్‌ కాంట్రాక్టర్‌ పట్ల సీఐ, ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారు. గోవింద మాల దీక్షలో ఉన్న భాస్కర్‌ రెడ్డిపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఆయిల్‌ సప్లయ్‌ కాంట్రాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం సమయంలో సిటీలోకి ఆయిల్ ట్యాంకర్‌ అనుమతి లేదని ట్యాంకర్‌ వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత రావాలని డ్రైవర్‌కు పోలీసులు చెప్పారు. దీంతో, రాత్రే వస్తానని డ్రైవర్‌ చెప్పాడు. ఈ క్రమంలో ట్యాంకర్‌ డ్రైవర్‌.. యజమాని భాస్కర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఎస్‌ఐతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆగ్రహించిన పోలీసులు.. డ్రైవర్‌ను కొట్టారు. ఈ నేపథ్యంలో గోవింద మాలలో ఉన్న ట్యాంకర్‌ యజమాని భాస్కర్‌ రెడ్డి హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. డ్రైవర్‌ను కొట్టడంపై ప్రశ్నించారు.

అనంతరం, రద్దీ సమయంలో కూడా ఆయిల్ సరఫరాకి నగరంలోకి వచ్చేందుకు అనుమతి ఉందని పోలీసులు పత్రాలను చూపించారు. దీంతో, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేషన్‌లో భాస్కర్ రెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. తన పట్ట దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని ఆరోపించారు. ఈ సందర్బంగా భాస్కర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంకర్‌కు అనుమతి ఉన్నా చలాన్లు రాశారు. చలాన్లు కట్టేందుకు స్టేషన్‌కు వెళితే నన్నే తిట్టి.. మాలలో ఉన్న నాపై చేయి చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రెడ్డి ధర్నాకు దిగారు. 
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)