Breaking News

పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్‌ నిర్వహించండి

Published on Wed, 08/13/2025 - 05:07

సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రా­శారు. పోలింగ్‌ సందర్భంగా టీడీపీ చేసిన అరా­చ­కాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు విని­యోగించుకోలేకపోయారని వివరించారు. 

అధి­కా­ర పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడింద­న్నా­రు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయ­టి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూం­డాలను పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మో­హరించిందని వివ­రించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్ప­టికీ, ఎటువంటి చర్యలు తీసు­కో­లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు ఫారాలను సమ­ర్పించడానికి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా  టీడీపీ గూండాలు అడ్డుకున్నారని వెల్ల­డించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియో­గించుకోకుండా నిరోధించారన్నారు. 

పోలీసు యం­త్రాంగం పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించడానికి బదులుగా, అధికార పార్టీ నాయ­కుల అరాచకా­లకు అండగా నిలిచిందని చెప్పారు. పులివెందుల జెడ్పీ­టీసీ వైఎస్సార్‌­సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌ రెడ్డి బయటకు రాకుండా టీడీపీ గూండాలు ఇంటిని చుట్టుము­ట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీ­­టీసీ పరిధి­లోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో అధి­కార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని తెలిపారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)