Breaking News

తక్కువ కాలుష్య నగరం కడప

Published on Wed, 04/02/2025 - 05:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో కడపలో వాతావరణ కాలుష్యం (గాలిలో ధూళి కణాలు పది మైక్రోమీటర్లు.. అంతకంటే తక్కువ వ్యాసం) పీఎం 10 సగటున 42 యూజీ/ఎం3 (ఎం క్యూబ్డ్‌)గా నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 15 ప్రధాన నగరాల వాతావరణ కాలుష్య గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం కాలుష్య తక్కువ ఉన్న నగరాల్లో 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో, 56 పాయింట్లతో కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయి. 

రాష్ట్రం మొత్తంమీద అత్యధిక కాలుష్యమున్న నగరంగా విశాఖ రికార్డులకు ఎక్కింది. విశాఖలో సగటున వాతావరణ కాలుష్యం 120 పాయింట్లుగా ఉంది. విశాఖ తర్వాత 76 పాయింట్లతో రాజమండ్రి రెండో స్థానంలో, 73 పాయింట్లతో విజయనగరం మూడో స్థానంలో నిలిచాయి. రాజధాని నిర్మాణం పూర్తి కాకుండానే, ఇంకా ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు మొదలు కాని అమరావతిలో కాలుష్యం సగటున 71 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా పేరొందిన ఢిల్లీలో సగటున 208 పాయింట్లు నమోదైంది. ఢిల్లీ తర్వాత నోయిడా 182 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

సత్ఫలితాలు ఇస్తున్న చర్యలు
నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్‌) కింద దేశ వ్యాప్తంగా  130 నగరాలు, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు కొన్ని పట్టణాల్లో సత్ఫలితాలిస్తున్నాయి. మన రాష్ట్రంలో విజయవాడలో కాలుష్యం బాగా తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2022–23లో 90 పాయింట్లుగా ఉన్న కాలుష్య స్థాయి 2023–24 నాటికి 61 పాయింట్లకు తగ్గింది. కడపలో 57 నుంచి 42 పాయింట్లకు, కర్నూలులో 64 నుంచి 56, నెల్లూరులో 56 నుంచి 52, శ్రీకాకుళంలో 71 నుంచి 68, విజయ­నగరంలో 75 నుంచి 73 పాయింట్లకు తగ్గింది.

మిగిలిన పట్టణాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి బీఎస్‌6 ప్రమాణాలను అమలు చేయడం, పాత వాహనాలను తుక్కు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందించడం, చెత్తను సమర్థ­వంతంగా నిర్వహించడం, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో కనీసం 5 శాతం వ్యవసాయ వ్యర్థాలను వినియోగించేలా నిబంధనలు తీసుకురావడం వంటి అనేక చర్యలను కేంద్రం అమలు చేస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)