Breaking News

సీఎం జగన్‌తో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా భేటీ..

Published on Tue, 07/18/2023 - 20:00

సాక్షి, తాడేపల్లి: కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆయనతో పాటు ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి రావాలని సీఎం జగన్‌ను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు.

కాగా విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మించనున్నారు. మూడేళ్లలో కె రహేజా గ్రూప్‌ రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఏపీలో మరిన్ని పెట్టుబడులపై సీఎం జగన్‌తో రహేజా గ్రూప్‌ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లు పాల్గొన్నారు. 
చదవండి: పెద్ద కష్టం తీరింది.. సర్వీస్‌ ఈనాం భూములపై సర్వ హక్కులు

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)