Breaking News

జగన్‌కు ఓటేయకపోతే నష్టపోతాం

Published on Sun, 05/12/2024 - 05:51

సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగింది, రాజ్యాంగ హక్కులు దక్కింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని, అదీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే సాధ్యమైందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య చెప్పారు. ఉత్తరాదిలో మోదీ ప్రాభవం తగ్గిపోవడంతో ఆయన దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడిందన్నారు. అలాంటి మనువాదులతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టమని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌కు ఓటేయకపోతే అధికంగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జస్టిస్‌ ఈశ్వరయ్య స్పందన ఆయన మాటల్లోనే..   

అగ్రవర్ణాల కుట్రలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు బలి 
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటరానివారుగా, ఆదివాసీలుగా, అగ్రకులాల సేవకులుగానే కాకుండా వారినొక వస్తువుగా చూశారు. వారికి ఎలాంటి అధికారాలుగానీ, హక్కులుగానీ ఇవ్వకుండా విధ్వంసం జరిగింది. మనువాదుల చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా వివక్షకు గురిచేశారు. విద్యావంతులై పాలనలో భాగస్వాములైతే తమ ఆధిçపత్యం దెబ్బతింటుందనే కుట్రతో అలాంటి సమాజాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక స్పృహ గల బుద్ధుడు, వేమన, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి, జ్యోతిరావు పూలే, డాక్టర్‌  అంబేడ్కర్‌ వంటి యుగపురుషుల త్యాగంతో భారత రాజ్యాంగం ఏర్పడింది.  

జగన్‌ పాలనలోనే రాజ్యాంగ ఫలాలు అందాయి 
బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక, ఆర్టీక న్యాయం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అందించాలన్న దృక్పథంతో రాసిన భారత రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేస్తోంది జగన్‌ ప్రభుత్వం. ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా ఎదురులేని స్వచ్ఛమైన, శక్తిమంతమైన సంకల్పంతో రాజ్యాంగ ఫలాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించే కృషి జరిగింది. విద్యాలయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధనతో ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లను తయారు చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.

బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును సుసంపన్నం చేసేందుకు పెట్టుబడి కింద భావించి బడ్జెట్‌లో నిధులు ఖర్చు పెడుతున్నారు. 2019లో ఆయన మేనిఫెస్టోను చూసి అసాధ్యమన్నారు. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జగన్‌ చట్టసభల్లోను సామాజికన్యాయం కలిగేలా ముందడుగు వేశారు. తన కుల, వర్గ ప్రయోజనాలూ ఖాతరు చేయకుండా సమానత్వం పాటించి రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో, కార్పొరేషన్ల పదవుల్లో 50 శాతం బీసీలకు అవకాశం కలి్పంచారాయన.

అలాంటి నాయకుడిపై కొందరు తప్పుడు అభిప్రాయాలను సృష్టించే యత్నం చేస్తున్నారు. ఆ అభిప్రాయానికి గురై తప్పుచేస్తే మనకు మనమే నష్టం చేసుకున్నట్టు అవుతుంది. ధనం, విద్య, అధికార బదలాయింపు కోసం, పేదలు సంపన్నులు కావడానికి, విద్యావేత్తలు కావడానికి, ఆరోగ్యవంతులు కావడానికి  పనిచేస్తున్న జగన్‌కు ఓటేయకపోతే ఏపీలోని బీసీలను  దేశంలో ఎవరూ నమ్మరు.  

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీ 
ఉత్తర భారతదేశంలో కూడా మోదీకి వ్యతిరేకత ఉంది. అక్కడ ఓడిపోతున్నందునే దక్షిణ భారతదేశంలో అబద్ధాలు మాట్లాడుతూ విలువల్లేని పార్టీలతో జతకట్టి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.  ఆయనకు మంత్రివర్గంపై, ప్రతిపక్షంపై, ప్రజలపై నమ్మకం లేదు. రిజర్వేషన్లు, కులగణనకు వ్యతిరేకమైన, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నా, బీసీల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నా, సామాజిక వెనుకబాటుకు గురైన ముస్లింల రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెబుతున్నా, మతకలహాలు, అంతర్యుద్ధం, రక్తపాతం ద్వారా పబ్బం గడుపుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు.. అని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు.

జగన్‌కు ఓటేస్తేనే బీసీలకు మనుగడ  
మనువాద, చాతుర్వర్ణ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టకరం. బీసీలను మోసం చేయడంలో భాగంగానే బాబు, పవన్‌కళ్యాణ్‌ బీజేపీతో చేతులు కలిపారు. రాజ్యాంగ ఫలాలను దక్కకుండా కుదిరిన ఈ పొత్తును ఏపీ ప్రజలు చిత్తుచేయాలి. అతిజాగ్రత్తగా ఆలోచించి దుష్టచతుష్టయాన్ని నిరోధించాలి. జగన్‌ను బీసీలే రక్షించుకోవాలి. జగన్‌కు ఓ­టే­యకపోతే మోసపోతాం. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా పూర్తిస్థాయిలో గెలిపిస్తే ఢిల్లీ పీఠం కదులుతుంది. జగన్‌ గెలిస్తే బీసీల బతుకులు బాగుపడుతాయి. కూటమి అధికారంలోకి వస్తే బీసీలు అంధకారంలోకి వెళ్తారు. ఈ యుద్ధంలో బీసీలే గెలుస్తారని, జగన్‌ను మరోమారు గెలిపిస్తారని నమ్ముతున్నాను. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)