Breaking News

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణం

Published on Tue, 10/31/2023 - 04:50

సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్‌ నరేందర్‌ సోమవా­రం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్‌ నరేందర్‌ను గవ­ర్నర్‌ అభినందించారు.

అంతకు ముందు ప్రభుత్వ ప్రధా­న కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీ­డింగ్స్‌ను నిర్వహించారు. అనంతరం జస్టిస్‌ నరేందర్‌ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్త­ర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ నరేంద­ర్‌ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌­భ­వన్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 

30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
జస్టిస్‌ నరేందర్‌ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్‌ నరేందర్‌ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్‌ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధి­తులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణ స్వీకార కార్య­క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొనలేకపోయారు.

దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ జి.నరేందర్‌
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేందర్‌ సోమ­వా­రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకు­న్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగ­తం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీ­ర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్‌ జస్టిస్‌ నరేంద­ర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)