Breaking News

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన

Published on Tue, 08/19/2025 - 20:07

కృష్ణాజిల్లా :  జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, శ్రద్ధాంజలి ఘటించారు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు. టీడీపీ ఎమ్మెల్యే చిత్ర పటాన్ని తగలబెట్టి నిరసన తెలియజేశారు. 

దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఎన్టీఆర్‌ అభిమానులు మండిపడ్డారు. వెంకటేశ్వర ప్రసాద్‌ బహిరంగ క్షమాపణ చెప్పే వరకూ రోజుకో రీతిలో నిరసన తెలుపుతామంటూ హెచ్చరించారు. ఆపై జూనియర్‌ .ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి , గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టారు అభిమానులు.

కాగా, రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ నోరు పారేసుకున్నారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి  ప్రసాద్‌ రెచ్చిపోయారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)