Breaking News

కర్నూలులో జ్యుడీషియల్‌ సిటీ 

Published on Wed, 08/23/2023 - 04:06

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలులోని జగన్నాథగట్టులో 250 ఎకరాలలో ప్రభుత్వం జ్యుడీషియల్‌ సిటీ నిర్మించనుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. కర్నూలులో రూ.17 కోట్లతో నిర్మించిన హరిత భవన్‌ను మంత్రి బుగ్గన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యుడీషియల్‌ సిటీలో హైకోర్టుతో పాటు నేషనల్‌ లా యూనివర్సిటీ, జ్యుడీషియల్‌ అకాడమీ, వివిధ ట్రిబ్యునళ్లకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో నేషనల్‌ లా యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమని.. వాటి ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో వరుసగా ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైన కార్యాలయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, విజయవాడతో పాటు ఇప్పుడు కర్నూలులో నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

త్వరలోనే నెల్లూరు, అనంతపురంలో కూడా నూతన భవనాలు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ శ్రీధర్, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహా్మనందరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ సృజన, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎంవీ రావు, బీవై మునిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)