Breaking News

బెదిరించిన విలేకరితో వాదించడమూ తప్పేనా?

Published on Thu, 02/22/2024 - 05:29

సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే  పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్‌టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు.

నాగేంద్ర పీడీ యాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు.  పరమేశ్వరరావు ఒక  పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో   అతన్ని తొలగించారు. ఈ క్రమంలో  అతనికి ఏడాది క్రితం  నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు  విలేకరిగా   అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. 

దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు..
ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్‌కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో  మరుసటి రోజు  యథావిధిగా  ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్‌ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు.

బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్‌ పరమేశ్వరరావు ఇసుకరీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్‌ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్‌లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్‌ తీసు­కుని   రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్‌ చేయి­స్తానంటూ దురుసుగా మాట్లాడాడు.

అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజి­లెన్స్‌ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజి­లెన్స్‌ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. 

వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం  
సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్‌ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్‌ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్‌ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు.

ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్‌ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వచ్చి పరామర్శించి, దీనికి  రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)