Breaking News

జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత

Published on Mon, 06/26/2023 - 07:18

సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో చికిత్స నిమిత్తం ఆయన ప్రైవేటు ఆసుత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అంబటి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌, అమరావతి ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు కూడా సంతాపం తెలిపారు. 

ఇక, విజయవాడ బావాజీపేటలోని ఆయన నివాసం నుంచి సోమవారం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబటి ఆంజనేయులు ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ) స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ సలహాదారుడిగా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని జిల్లాల్లో యూనియన్‌ను విస్తరింపజేశారు. ఏపీ న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా నాన్‌ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నేడు వైఎస్సార్‌ లా నేస్తం ఆర్థిక సాయం

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)