Breaking News

భలే మంచి ‘ఉద్యోగ’ బేరమూ..!

Published on Tue, 04/22/2025 - 04:12

తాడేపల్లి రూరల్‌: ఉద్యో­గాలు ఇప్పిస్తానంటూ రాజ­ధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధప­డిన ఒక జనసేన నాయకుని ప్రయత్నం ఆది­లోనే బెడిసికొట్టిన వైనమిది. సేకరించిన వివరాల ప్రకారం, విజయవాడ ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే శివ అనే ఒక జనసేన నాయ­కుడు ఉండవల్లిలోని మూడు బొమ్మల సెంటర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకు­న్నాడు.  రాష్ట్రంలోని దేవదాయ శాఖ, పౌరసర­­ఫరాల శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపీతో, మంత్రితో మాట్లాడి ఆ ఉద్యో­గాలు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయ­కులు, కార్యకర్తలతో గడచిన కొంత కాలంగా ప్రచా­రం నిర్వహించాడు.

ఈ ప్రచారం మేరకు దాదాపు 200 మంది నిరు­ద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సోమ­వారం ఉండవల్లిలోని ఆయన నివాసా­నికి చేరుకు­న్నారు. వీరి నుంచి రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూళ్ల దందా ప్రణాళికను సిద్ధం చేసుకున్న నిందితుడు నిరుద్యోగుల నుంచి నగదు, సర్టిఫికెట్లు సేకరించడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమాయత్తం అవుతుండగా, మీడియా రాకతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

అయితే ‘తగ్గేదేలే..’ అన్నట్లు ఎంపీ, మంత్రులు తన వెనుక ఉన్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకో­వడంతో, ఉద్యో­గాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నా­నని ఒప్పు­కు­న్నాడు. డిగ్రీలు చదివి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఎలా నమ్మారంటూ నిరుద్యోగులను ప్రశ్నించగా, ఎంపీ బాలశౌరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్‌ తనకు తెలుసని, వారి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తా­మని నిందితుడు చెప్పినట్లు అక్కడివారు తెలిపారు. ఇంకా ఎవ్వరూ డబ్బులు చెల్లించలేదని కూడా వారు పేర్కొనడం గమనార్హం. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)