Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
Published on Thu, 01/26/2023 - 11:25
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్‌పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు.
ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు
Tags : 1