Breaking News

జనసేన దుకాణం క్లోజ్‌!

Published on Tue, 03/19/2024 - 05:48

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్‌ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం.  ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానా­న్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటా­యించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమ­ను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్‌రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నా­రు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం.

ఇది రెండోసారి 
జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండో­సారి. గతంలో నరసింహనగర్‌ రైతుబజార్‌ స­మీపం­లోని అపార్టుమెంట్‌లో పార్టీ కార్యాల­యం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యా­లయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పా­టు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు  మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)