Breaking News

ఎస్‌ఐకి డబ్బులు కొట్టాం.. సెక్షన్లు తీసిపడేశారు!

Published on Mon, 03/31/2025 - 05:19

తణుకు అర్బన్‌: ‘పెట్టిన  కేసు వాపసు తీసుకోకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా’  అంటూ జనసేన దు­వ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్‌ చిన్ని, తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి వెంకటలక్ష్మి అనే ఒక మహిళా ఉద్యోగిని వేధించిన వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ ఇరువురిపై కేసు నమోదయిన నేపథ్యంలో  వేణు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో తాజాగా సామాజిక మాధ్యమా­ల్లో వైరల్‌గా మారింది. ఆడియోలో ఉన్న ప్రకారం.. ‘ఇక్కడ ఎవరున్నారు. ఏమి గొడవ జరిగింది.  

ఎంఎల్‌ఏ దగ్గ­రకు వెళ్లారు. కేసు పెట్టారు. ఎస్‌ఐని సెక్షన్‌లు తీసేయమన్నాం. తియ్యనన్నారు. ఎంతకావాలని అడిగాం. రెండో మాట లేదు. టేబుల్‌ పై­న పెట్టేసి వచ్చేశాం. సెక్షన్‌లు తీసిపడేసారు. ఏమ­వుతాది..?’ అన్న మాటలు ప్రకంపనలు సృష్టిస్తుండడంతో పోలీసు వర్గాలకు సైతం చిర్రెత్తుకొచ్చినట్లు సమాచారం.  ఇప్పటివరకు అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెస్తున్న కూటమి నాయకులు, నేడు పోలీసులనే కొనేశాం అని ధైర్యంగా చెప్పే పరిస్థితి తణుకు నియోజకవర్గంలో దాపురించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.  

ప్రాణభయం ఉంది: బాధిత మహిళ 
ఈ వ్యవహారంపై పనిగట్టుకుని అందరికీ ఫోన్‌లు చేసి.. తనకు దూరంగా ఉండాల్సిందిగా జనసేన నాయకులు చెబుతున్నారని బాధితురాలు  వెంకట­లక్ష్మి  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై చాలా కక్షపూ­రితంగా ఉన్నారని, తనను బతకనిచ్చేలా లేర­న్నారు. ఈ వ్యవహారంపై తణుకు రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను సాక్షి వివరణ కోరగా  వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గతేడాది జూలైలో బాధితురాలు బావ నరసి­ం­హస్వామి అలియాస్‌ అంతర్వేదికి–  చిన్నికి  మధ్య ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై గా­యా­లయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు­ను వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, వేణులు వెంకటలక్ష్మిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వేధింపులు భరించలేక ఆమె వీరిరువురిపై కేసు పెట్టారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)