జనసేన చోటా నేత రౌడీయిజం.. బూతులు తిడుతూ హోంగార్డుపై దాడి

Published on Mon, 08/25/2025 - 13:44

సాక్షి, కృష్ణా: కూటమి ప్రభుత్వ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా జనసేన నేత ఒకరు రౌడీయిజానికి దిగారు. తనకు సెల్యూట్‌ కొట్టలేదని హోంగార్డుపైనే దాడికి పాల్పడ్డాడు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని  విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి తనతోటి సిబ్బందితో కలిసి హోంగార్డ్ మోహనరావు బీట్ డ్యూటీ చేశారు. అదే సమయంలో మచిలీపట్నం జనసేన ఎనిమిదో డివిజన్ ఇంచార్జి కర్రి మహేష్ అటుగా వెళ్లారు. ఈ సందర్బంగా తనను చూసి సెల్యూట్ కొట్టలేదంటూ హోంగార్డ్ మోహనరావుపై కర్రి మహేష్ దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన మహేష్‌.. హోంగార్డును నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. ఏంట్రా నేను వస్తే కూర్చుంటరా.. సెల్యూట్ కొట్టాలని తెలియదా అంటూ వారిని చితకబాదారు.

ఎస్పీకి చెప్పుకుంటావో.. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బూతులతో రెచ్చిపోయాడు. ఎస్పీకి చెప్పినా.. ఏమీ పీకలేరంటూ తీవ్ర పదజాలం వాడారు. అనంతరం, జనసేన చోటా నేత కర్రి మహేష్‌ దాడిలో హోంగార్డు మోహనరావు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు మోహనరావు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జనసేన కర్రి మహేష్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం.

Machilipatnam: సెల్యూట్ కొట్టలేదని హోమ్ గార్డుపై దాడి

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)