బడుగులపైకి బుల్డోజర్‌

Published on Sun, 08/04/2024 - 05:45

సాక్షి, విశాఖపట్నం: రోడ్డు పక్కన చిరు వ్యాపా­రాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్‌ తన ప్రతాపాన్ని చూపించారు. అధికారమే అండగా వారి దుకాణాలపైకి బుల్డోజర్‌ను పంపి కూల్చి­వేయించారు. వారి పొట్టకొట్టి రోడ్డున పడేలా చేశారు. గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 22వ వార్డు పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్నచిన్న దుకాణాల్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు. 

పీతల మూర్తి యాదవ్‌ 2021లో కార్పొరేటర్‌గా గెలిచిన­ప్పటి నుంచి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవ­లకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులన్నీ తొలగించేస్తా­నంటూ సవాల్‌ విసిరారు. గత వైఎస్సా­ర్‌సీపీ ప్రభు­త్వ హయాంలో చిరు దుకా­ణా­­లపై ఫిర్యాదు చేసినా అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసు­కున్న గత ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. దుకా­ణాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  

చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా పిటిషన్‌
ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక.. చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులివ్వకుండానే దుకాణాలు తొలగింపు ప్రక్రి­యని మొదలు పెట్టేశారు. ఏయూ గేట్‌ని ఆనుకొని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించిపారేశారు.

దుకాణాలను కోల్పో­యిన­వారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించగా జీవీఎంసీ అధికారులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియని నిలిపివేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్‌.. జీవీఎంసీ అధికారులకు ఫోన్‌ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినదించారు.

పన్ను చెల్లించినప్పుడు అక్రమమని గుర్తులేదా?
నేను ఇక్కడ 30 ఏళ్లుగా సెలూన్‌ నడు­పు­తున్నా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహి­స్తున్నా. ట్రాఫిక్‌కు కూడా ఏ ఇబ్బందీ లేదు. జీవీఎంసీకి పదేళ్ల నుంచి పన్నులు కూడా కడుతున్నా. ఇప్పుడు జన­సేన కార్పొరేటర్‌ చెప్పారని దుకాణాలు తొల­గి­స్తున్నారు. నా దుకాణం ఏర్పాటు అక్రమ­మైతే పన్నులు ఎందుకు కట్టించుకున్నారో అధికారులు, కార్పొరేటర్‌ చెప్పాలి.    – కె.వెంకటరమణ,  సెలూన్‌ షాప్‌ నిర్వాహకుడు

నోటీసులివ్వకుండా కూల్చారు 
నెల్లూరు నుంచి వలస వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడ టిఫిన్‌ దుకాణాన్ని నడుపుతు­న్నాం. ఇంతకు ముందు.. కొ­ంచెం లోపలకు పెట్టుకొండి.. లేదంటే పగలగొట్టేస్తామని జనసేన కార్పొరే­టర్‌ మూర్తి చెప్పారు. మూడు రోజుల నుంచి చిన్న చిన్న మరమ్మ­తులు చేస్తున్నాం. ఇప్పుడు నోటీ­సులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. ఈ దుకా­ణంలో మా కుటుంబంతో పాటు మరో ఏడు­గురు పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పు­డు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తా­రా? – కస్తూరయ్య, టిఫిన్‌ దుకాణం నిర్వాహకుడు

Videos

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

Photos

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)