Breaking News

టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు..!

Published on Sun, 10/12/2025 - 05:59

చిత్తూరు అర్బన్‌: ‘‘ఎమ్మెల్యే చెప్పినా అంతే. చట్టం చట్టమే. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు’’ అంటూ చిత్తూరు కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడుపై జనసేన నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిత్తూరులోని ఓ హోటల్‌­లో శనివారం హై రోడ్డు భవన యజమా­నుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు వెంకటేష్‌ నాయుడు మాట్లాడుతూ చిత్తూరు­లోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగు­లకు ఒప్పించామన్నారు. 

పరిహారం, టీడీఆర్‌ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని కో­రారు. ఇంతలో సభలో కూర్చున్న జనసేన నాయ­కుడు దయారాం నాయుడు మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? ఎమ్మెల్యే ఓ పొరంబోకు. ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ చిత్తూరుకు వచ్చిన­పుడు హై­రో­డ్డు భవన యజ­మా­నులకు పరిహారం ఇవ్వా­ల్సిందేన­న్నా­రు. ఇప్పుడు కూ­డా ఆయన వద్ద్దకే వెళ్తాం. కూటమి ఉంటుందో, ఊడి­పోతుందో తర్వాత కథ. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది. కొట్టండి నీవానది ఆక్రమణల్ని. 

చంద్రబాబు అమెరికా, యూరప్‌ పోయి ఫండ్స్‌ తీసుకొస్తా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు. ముందు చిత్తూరు హై రోడ్డును అభివృద్ధి చేయండి. శ్మశానంలాగా తయా­రయ్యింది హై రోడ్డు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం పనికిరాని భూములకు రూ.కోట్లలో పరిహారం ఇచ్చింది. 

ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలియదా? ఎంతసేపు బిల్డింగ్‌ కొట్టేయండి, కొట్టేయండి అని ఎమ్మెల్యే అంటున్నారు. ఆయనకు పేరు వచ్చేయాలి. మరి మేము రోడ్డున పడాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని, టీడీఆర్‌ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)