Breaking News

మహిళా ఉద్యోగిపై జనసేన నాయకుల అమానుషత్వం

Published on Sun, 03/30/2025 - 02:57

తణుకు అర్బన్‌: తనపై పెట్టిన ప్రైవేటు కేసును ఉపసంహరించుకోవాలని చిన్ని అనే జనసేన నాయకుడు మరో సహచర నాయకునితో కలిసి ఒక మహిళా ఉద్యోగినిపై అమానుషత్వం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె,  తాజాగా తనకు ప్రాణభయం ఉందని వాపోతు­న్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి బాధితురాలు తెలిపిన వివరాలు పరి­శీలిస్తే,  పంచాయతీ బిల్లు కలెక్టర్‌గా కాంట్రాక్టు పద్ధ­తిలో నీలం వెంకటలక్ష్మి బాధ్యతలు నిర్వహి­స్తున్నారు.  

గతేడాది జూలైలో ఆమె బావ నరసింహస్వామి అలియాస్‌ అంతర్వేదికి– జనసేన దువ్వ  అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్‌ చిన్నికి  మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది.   సదరు కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, జనసేన పార్టీ తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. 

తలుపులు వేసి మరీ దుర్భాషలు..
ఈ నేపథ్యంలో మార్చి 28న  ఫీల్డులో ఉన్న వెంకటలక్ష్మిని పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందిగా జనసేన నాయకులు ఫోన్‌ చేశారు.  పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తరువాత ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని  పట్టుబట్టారు. అయితే ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని,  అంతర్వేదితోనే మాట్లాడుకోమని ఆమె చెప్పారు.

దీంతో రెచ్చిపోయిన నాయకులు ఇరువురు  తలుపులు వేసి మరీ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నట్లు తణుకు రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో దువ్వ పంచాయతీ కార్యాలయాన్ని కూటమి పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)