Breaking News

నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా?

Published on Mon, 03/10/2025 - 05:31

ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్‌పై విరుచు­కుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటి­లాగే పోలీసులు ప్రేక్షకపాత్ర­కు పరిమితమ­య్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే..  ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్‌తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.

ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్‌ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు. 

గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్‌ శ్వేతకు సెల్‌ఫోన్‌ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్‌ బాధితులకు వైద్యం అంది­స్తున్నట్లు చెప్పారు. 

అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీ­దా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్‌­వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 

సెల్‌ఫోన్‌ లాక్కుని.. నగదు దోచుకుని..
ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కా­ర్మి­కురాలు తన సెల్‌లో వీడియో తీస్తుండగా జన­సే­న కార్య కర్తలు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లి­పో­యారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగ­దును ట్రాన్సఫర్‌ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరు­గుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక­పాత్ర పోషించారు.

 మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటన­లు పునరా­వృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివై­ద్యులు డిమాండ్‌ చేశారు. కాగా, డాక్టర్‌ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్‌ చేస్తున్నట్లు జనసేన  తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)