Breaking News

కామంతో కాటేసిన జనసేన కార్యకర్త

Published on Sat, 02/28/2026 - 04:22

గుంటూరు రూరల్‌: పదో తరగతి విద్యార్థినిపై కన్నేసిన జనసేన కార్యకర్త తన పశువాంఛ తీర్చుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వివరాలు వెల్లడించకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. నిందితుడు జనసేన కార్యకర్త కావటం, అధికార పార్టీ నాయకులు చేసే అక్రమ మైనింగ్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా పోలీసులు గోప్యత పాటిస్తున్నట్టు తెలిసింది. 

తనపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్న సమాచారం తెలుసుకున్న జనసేన కార్యకర్త పరారైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓబులునాయుడు పాలెం గ్రామానికి చెందిన మాదల నాగరాజు(35)కు  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చురుగ్గా పనిచేసిన అతడు చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అక్రమ మైనింగ్‌ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నాడు. 

కాగా.. డంపింగ్‌ యార్డు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహిళ ఇంటి పరిసరాల్లో మైనార్టీ వర్గానికి చెందిన పదో తరగతి బాలికపై నాగరాజు కన్నుపడింది. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ సైతం నాగరాజు ఇచ్చే డబ్బుకు ఆశపడి చిన్నారిని సమిధగా మార్చి అతడి కామవాంఛ తీర్చేందుకు సహకరించింది. 

ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యంగా కనిపించటంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులకు వాస్తవం తెలిసిపోవడంతో నాగరాజు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులు నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశా­రు. 

నిందితుడిని అరెస్ట్‌ చేయకపోవడంతో అతడు పరారైనట్టు తెలిసింది. బాలికను నాగరాజుతో చనువుగా ఉండేందుకు కృషిచేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడికి అధికార పార్టీ పెద్దల అండ ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం లేదని తెలిసింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)