Breaking News

ఓటర్ల పేర్లు తీసేయడం సులభం కాదు

Published on Wed, 10/04/2023 - 03:47

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా నుంచి ఫలానా వ్యక్తుల పేర్లను తీసేయాలంటూ దరఖాస్తులు రాగానే.. ఆటో­మేటి­క్‌గా వారి పేర్లను తొలగించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్ని­కల సంఘం (సీఈసీ) మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు నిర్ధిష్ట విధానం ఉందని సీఈసీ తరఫు న్యాయవాది డీఎస్‌ శివ­దర్శన్‌ హైకోర్టుకు వివరించారు.

ఓటర్ల తొలగింపు విష­యంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చి­న­ప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోవడానికి త్రిసభ్య కమిటీ ఉంటుం­దన్నారు. అసలు దర­ఖాస్తులు పెట్టిన వ్యక్తులు ఎవరు? వారి చిరునా­మాలు, ఫోన్‌ నంబర్లను కూడా తెలుసుకుంటామ­న్నారు. పిటిషనర్‌ ఆరోపి­స్తు­న్నంత సులభంగా ఓటర్ల తొలగింపు ఉండదని పునరుద్ఘాటించారు.

ఓటర్ల తొల­గింపు విషయంలో తమకొచ్చిన దరఖాస్తులు తప్పుడువని తేలితే, అలా దరఖాస్తు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎవరి పేర్లయితే ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారో అలా తొలగించే వ్యక్తులకు ముందుగా నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆకాశ రామన్న ఉత్తరాలు రాగానే ఓటర్ల పేర్లు తొలగించామనడం సరికాదన్నారు.  

పర్చూరు ఎమ్మెల్యే పిటిషన్‌ నేపథ్యంలో..
పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఏకపక్షంగా ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను, నిబంధనలను అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఓటర్లను జాబితా నుంచి తీసేస్తున్నారని తెలిపారు.

ఈ మొత్తం ప్రక్రియను పోలీసులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు సాధారణంగా అమల్లో ఉన్న విధానం ఏమిటని ప్రశ్నించింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్‌ స్పందిస్తూ.. పూర్తి విధానాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఆ వాదనలను విన్న ధర్మాసనం వివరాలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని శివదర్శన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)