Breaking News

జనానికి జ్వరమొస్తే నాదా బాధ్యత?

Published on Thu, 10/23/2025 - 07:10

సాలూరు: జనాలకు జ్వరమొస్తే మంత్రిదా బాధ్యత? అంటూ రాష్ట్ర స్త్రీ,  శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి బుధ వారం హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ ఊరిలో, ప్రతీ పాఠశాలలోని పిల్లలు జ్వరాలు, పచ్చకామెర్లతో బాధ పడుతున్నారన్నారు. 

ఇది వాస్తవమన్నారు. తాను కూడా గత వారంలో రోజు లుగా జ్వరంతోనే బాధపడుతున్నానని.. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఎవరికైనా జ్వరం వస్తే తానెలా బాధ్యత వహిస్తానని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు పచ్చకామెర్లతో మృతిచెందగా.. జ్వరాలు, వివిధ ఆరోగ్య సమస్యలతో మరో 13 మంది విద్యార్థులు మరణించారు. 

దీనిపై గిరిజన, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. మంత్రిని కూడా నిలదీశాయి. దీనికి ఆమె  సమాధానం చెప్పకుండా, పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందజేసేందుకు కృషిచేస్తానని కూడా పేర్కొనకుండా, జ్వరాలు సోకితే తనదెలా బాధ్యతంటూ మంత్రి సంధ్యారాణి మీడియా సాక్షిగా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై గిరిజన, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)