Breaking News

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

Published on Mon, 10/09/2023 - 14:36

సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(AP CID).  సోమవారం నలుగురి పేర్లను చేరుస్తూ.. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. 

మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్ కుమార్ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ..  సెక్షన్ 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది కూడా. 

ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్‌, ఏ-18గా ప్రమీల, వరుణ్‌కుమార్‌ కొత్తాపును ఏ19గా చేర్చింది. 

ఈ కేసుకు సంబంధించి నారా  లోకేష్‌కు, నారాయణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్‌ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: నారా-నారాయణ దోపిడీ.. ఇలా.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)