Breaking News

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంటలపై విచారణ

Published on Sat, 02/08/2025 - 05:12

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద రోడ్డు వెంబడి ఏర్పడిన మంటలపై తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టారు. దీన్లోభాగంగా గుంటూరు జిల్లా లా అండ్‌ ఆర్డర్‌ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం, ఫోరెన్సిక్‌ బృందాలు మంటలు ఏర్పడిన ప్రాంతం వద్ద ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు, ఎస్‌ఐలు ఖాజావలి, జె. శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ కూడా ఆ  ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కులో మంటలు చెలరేగడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాడేపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి చెప్పారు. 

తరచూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూ­ర్వకంగా గొడవ చేస్తున్నారని తెలిపారు.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు భంగం కలిగేలా  నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)