Breaking News

కోర్టు సిబ్బందిని కొట్టిన సీఐపై విచారణ

Published on Sun, 05/07/2023 - 09:35

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్‌ కమిషనర్, అతనికి సహాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులను అనంతపురం జిల్లా హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌ కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్‌ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్‌ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

విచారణ కోసం వెళ్లగా.. హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్‌ అనే వ్యక్తి­ని అక్కడ పోలీసులు అక్రమంగా నిర్బంధించా­రంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు సదరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వాస్తవాలను పరి­శీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఉదయ్‌­సిం­హారెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. గిరీష్‌ అక్రమ నిర్బం­ధంలో ఉంటే తీసుకురావా­లని అడ్వొకేట్‌ కమిషనర్‌కు స్పష్టం చేసింది. 2022 అక్టోబర్‌ 21న ఉదయ్‌సింహారెడ్డి హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేష­న్‌కు వెళ్లారు. అతనికి సహాయకులుగా కోర్టు సిబ్బంది, గిరీష్‌ తరఫు న్యా­య­వాది, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్‌ పోలీసుల నిర్భంధంలో ఉన్నా­రని, అతన్ని పోలీసులు కొట్టినట్టు అడ్వొకేట్‌ కమి­షనర్‌ గుర్తించారు.

అతనికి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్‌స్పెక్టర్‌ను ఉదయ్‌సింహారెడ్డి కోరా­రు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్‌ కమిషనర్‌తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై ప్రిన్సి­పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సదరు ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరారు. అయితే, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో జడ్జి ఈ విషయాన్ని డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా జడ్జి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జడ్జి సైతం హైకోర్టుకు ఓ నివేదిక పంపారు.

ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా ఉన్న హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవా­న­ంద్‌ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమో­టో పిల్‌గా పరిగణించాలని, తగిన ఉత్తర్వుల నిమి­త్తం సీజే ముందుంచాలని జస్టిస్‌ దేవా­నంద్‌ రిజిస్ట్రీని ఆ­దేశించారు. ఆ తరువాత డీజీపీ స్పందిస్తూ.. బా­ధ్యుౖ­లెన పోలీసులకు శిక్ష విధించామని, రెండేళ్ల పా­టు ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేశామని కోర్టుకు నివేదించారు. జిల్లా జడ్జి నివేది­కను పరిశీలించిన హై­కోర్టు దీనిని సుమోటోగా పిల్‌గా పరిగణించాలని నిర్ణ­యించింది. ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

(చదవండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)