Breaking News

మనోళ్లేనా.. ఐతే సరే.!

Published on Wed, 12/18/2024 - 04:48

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఇంటర్వ్యూలు రెండో రోజు మంగళవారమూ మొక్కుబడిగానే సా­గాయి. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలో డైరెక్టర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కూటమి ప్ర­భు­త్వం నిబంధనలు గాలికొదిలేసి, ఇస్టానుసా­రం మార్చేసుకుంది. కనీస అర్హత లేకున్నా వారికి న­చ్చిన వారైతే అన్నింటినీ ఉల్లంఘించి అర్హత ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందనే విమర్శలు వినిపి­స్తు­­న్నాయి. 

డైరెక్టర్‌ పోస్ట్‌కు కనీస అర్హత మూడు సంవత్సరాల కాలంలో  సూపరింటెండెంట్‌ ఇంజనీర్, చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. కానీ జెన్‌కోలో డిప్యూటీ ఇంజనీర్‌­గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కార్పొరేషన్‌లో చేరిన ఓ అధికారికి నిబంధ­నలకు విరుద్ధంగా డైరెక్టర్‌ పోస్టుకు అర్హత కల్పించారు. ఆయన సహచరులు జెన్‌కోలో డీఈలుగానే ఉన్నారు. ఆయనకు హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ పోస్టుకు అవకాశమిచ్చారు.

చిత్రమేమిటంటే ఇదే అభ్యర్ధిని థర్మల్, హైడల్‌ డైరెక్టర్‌ పోస్టులకు అన­ర్హుడిగా పేర్కొ­న్నారు. డైరెక్టర్ల పోస్టుల భర్తీలో అడ్డగోలు నిబంధనలకు ఇదో ఉదాహరణ. దా­దాపు అన్ని పోస్టు­లకు తమ వారికి అనుగుణంగా ఇలా నిబంధనలు మార్చేశారు. బుధవారం ఏపీసీ­పీడీసీఎల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

కాపు సంఘాల ‘సామాజిక’ ఉద్యమం
విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టులకు పైరవీల కారణంగా తమ సామాజిక వర్గం అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానంతో గత ఎన్నికల్లో కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

విద్యుత్‌ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞులు, నిజాయితీప­రులు, చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో పని చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారందరూ డైరెక్టర్‌ పోస్టు­లకు అర్హులని, దామాషా పద్ధతిలోనైనా న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తు­న్నారు. దామాషా పద్థతిలో ఇస్తే 15 పోస్టుల్లో జెన్‌కోలో ఒకటి, ట్రాన్స్‌కోలో ఒకటి, డిస్కంలలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 5 పోస్టులు కాపులకు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. 

ఈ వాట్సప్‌ మెసేజ్‌లను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు, మంత్రి లోకేశ్‌కు చేరే వరకూ  ఫార్వార్డ్‌ చేయాలని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)