Breaking News

‘బాలల కమిషన్‌’పై తర్జనభర్జనే..

Published on Wed, 12/10/2025 - 02:09

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూ­ల నిర్వహణకు తర్జనభర్జన సాగుతూనే ఉంది. ఇప్ప­టికే 3సార్లు నోటిఫికేషన్ల రద్దు, మూడు­సార్లు ఇంటర్వ్యూల వాయిదాలతో 8 నెల­లు గడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు­తో రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. 

తాజాగా ఈ నెల 3 నుంచి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ముందురోజు రాత్రి రద్దుచేసింది. దీంతో మళ్లీ ఈ నెల 11, 12, 13 తేదీల్లో కమిషన్‌ నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న మంత్రివర్గ సమావేశం ఉండటంతో 12, 13, 14 తేదీలైతే ఎ­లా ఉంటుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. 

వైఎస్సార్‌సీపీ పాలనలో నియమించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 19తో ముగిసింది. కొత్తగా కమిషన్‌ నియామకాని­కి జూన్‌ 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన తొలి నోటిఫికేషన్‌లో విద్యార్హత పీజీ ఉండాలనే నిబంధన పెట్టారు. దానిపై వివాదం నెలకొనడంతో 2 వారాల తరువాత విద్యార్హతను సవరించి డిగ్రీ చాలు అని మరో నోటి­ఫి­కేషన్‌ ఇచ్చారు. 

ఆ తర్వాత మూడో నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో ఇచ్చి.. తరువాత దాని గ­డువు పొడించారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత రెండుసార్లు చేపట్టిన కమిషన్‌ నియామకంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో డిగ్రీ విద్యార్హత అనే నిబంధన పెట్టలేదు. దీంతో 2017లో నియమించిన కమిషన్‌లో ఇద్దరు సభ్యులు, 2022లో కమిషన్‌లోని ఒకరికి డిగ్రీ విద్యార్హత కూడా లేకపోవడం గమనార్హం.   

26 జిల్లాల సీడబ్ల్యూసీలకు నోటిఫికేషన్‌  
ఏపీలోని 26 జిల్లాల బాలల సంక్షేమ క­మిటీ (సీడబ్ల్యూసీ)ల నియామకాన్ని కూ­డా ప్ర­భుత్వం వాయిదాల పర్వంతోనే సాగదీ­స్తోంది. ఇప్పటికే 3 సార్లు నోటిఫికేషన్‌ రద్దుచేసిన ప్రభుత్వం.. తాజాగా మంగళవారం 26 జిల్లాల సీడబ్ల్యూసీల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసింది. అర్హత కలిగినవారు ఈ నెల 22లోపు డబ్ల్యూడీసీడబ్ల్యూ.­ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిచేసిన తరువాత మెయిల్‌ ద్వారా పంపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  

‘పదేళ్ల అనుభవం’పై ఫేక్‌ సర్టిఫికెట్లు
కమిషన్‌ చైర్మన్, ఆరుగురు సభ్యుల నియామకానికి 650 దరఖాస్తులు వచ్చాయి. వడపోత అనంతరం 359 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. బాలల న్యాయచట్టం ప్రకారం.. బాలలకు సంబంధించిన చట్టాల్లో అనుభవం, విద్య, ఆరోగ్యం, రక్షణ, సంరక్షణ, అభివృద్ధితోపాటు ది­వ్యాంగ బాలలు, బాలకార్మిక, బాల్య వివాహా­లు, అణగారిన బాలలు, బాలల సైకాల­జీ తది­తర అంశాలలో పదేళ్లపాటు పనిచేసిన వారిని కమిషన్‌ చై­ర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంది. 

బా­లల కోసం నిజంగా పనిచేస్తే వారి గుర్తింపు కార్డు, హాజరు, జీతాల వివరాలతోపాటు పనిచేసినకాలంలో ప్రెస్‌ క్లిప్పింగ్స్, ఫొటోల ఆధారాలుండాలి. కానీ.. ఇంటర్వ్యూల­కు హాజరయ్యే చాలామంది.. పదేళ్లపాటు బాలల కోసం పనిచేసినట్లు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు), ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల నుంచి తీసుకున్న నకిలీ ధ్రువీకరణ పత్రాలు జతచేసినట్లు తెలిసింది. పలువురు టీడీపీ నాయకులు సైతం ఫేక్‌ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసినట్టు తెలిసింది.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)