Breaking News

కొణతాల మదిలో ఓటమి భయం 

Published on Tue, 03/12/2024 - 11:06

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పరుచూరి భాస్కర్‌రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్‌రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్‌ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు. 

కొణతాల మదిలో ఓటమి భయం 
టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్‌ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు.

 దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్‌కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్‌రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్‌ కూడా పూర్తిగా హాజరు కాలేదు. 
 
అలిగిన నాగ జగదీష్‌ 
టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్‌ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్‌ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్‌ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)