Breaking News

ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌

Published on Mon, 01/05/2026 - 05:04

మంగళగిరి టౌన్‌: పట్టపగలే ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. మంగళగిరి పట్టణ పరిధిలోని గండాలయపేటకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఒక కుమార్తె విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది.

ఈనెల 2వ తేదీ అనుమతి లేకుండా మీ కుమార్తె బయటకు వెళ్లిందని కాలేజీ యాజమాన్యం బాలిక తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. విచారించగా కురగల్లుకు చెందిన రవితేజ అనే అబ్బాయితో వెళ్లినట్లు తేలింది. అదేరోజు రాత్రి బాలిక తల్లిదండ్రులు కురగల్లులోని రవితేజ ఇంటి నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రవితేజ కొంతమంది యువకులతో బాలిక ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్లాడు. అడ్డుకునేందుకు యత్నించిన తమపై  దాడి చేశారని విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది.

నిందితులపై కేసులు 
విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వీరాస్వామి పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. విద్యార్థినిని తీసుకువెళ్లిన రవితేజను వెలగపూడి సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్న కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రవితేజతో పాటు వెళ్లిన యువకులు విజయవాడకు చెందిన వారని, అందులో కొంతమందిని గుర్తించామని, మరో వ్యక్తి కురగల్లుకు చెందిన వ్యక్తి అని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రవితేజపై పోక్సో యాక్ట్‌తో పాటు కిడ్నాప్, మహిళలపై దాడి కేసు నమోదు చేశామని, అతనికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. అయితే తల్లిదండ్రులతో వెళ్లేందుకు విద్యార్థిని నిరాకరించడంతో మేయర్స్‌ హోంకు తరలించారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు