Breaking News

‘అమ్మానాన్నా.. ఐ యామ్‌ సారీ’

Published on Fri, 03/07/2025 - 12:03

ఎస్‌.రాయవరం:  పరీక్షల ఒత్తిడో...అనారోగ్య కారణమో.... లేత మనసుకు తగిలిన గాయమో...ఓ బాలిక ఉసురు తీసింది. పరీక్షల సమయంలోనే ఓ విద్యా కుసుమం రాలిపోయింది..  కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(Intermediate second year) చదువుతున్న బాలిక ఉరి పోసుకుని గురువారం మృతి చెందింది. 

ఎస్‌ఐ విభీషణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తుని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జోగా సృజన జయప్రియ(Srijana Jayapriya) (17) బుధవారం ఇంగ్లిష్‌ పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడంతో ఆమెను ఇంటి దగ్గర ఉంచి, తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. ఇంటిదగ్గర ఎవరూ లేని సమయం చూసి సృజన జయప్రియ సూసైడ్‌ నోట్‌ రాసి ఉరిపోసుకుని చనిపోయింది. 

ఈ సూసైడ్‌ నోట్‌లో(Suicide note)  ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి...నా చావుకి నా ఆరోగ్యమే(Health) కారణం ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను...దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా.. నా కోరిక తీర్చుకోలేనేమోనని నాలో నేనే చాలా బాధ అనుభవించాను...సారీ అమ్మ ఎందుకు చనిపోయానో కారణం ఎవరికీ చెప్పకండి.. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు.. తమ్ముడు చరణ్, చిన్నా మీరు బాగా ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి... నాన్నను బాధపెట్టకండి. నాన్న చెప్పిన మాట ఆలకించండి.. నేనే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది.. లవ్‌యు అమ్మ, నాన్న అండ్‌ మై బ్రదర్స్‌ గుడ్‌బై..’ అని రాసింది. 

ఈ లెటర్‌ చూసి చదివిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందమైన జీవితం ఉంటుందనుకున్న తరుణంలో కుటుంబ సభ్యులను తీరని దుఃఖ సాగరంలో ముంచి బాలిక మృతి చెందిందని ఆవేదన చెందారు. గ్రామంలో ఈ బాలిక మృతి వార్త విని ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. చదువు ఒత్తిడి, చిన్న ఆనారోగ్యం బాలిక ప్రాణాలు తీశాయని పోలీసులకు తెలిపారు. వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)