Breaking News

రికార్డులు రాస్తాం.. రారండి..

Published on Sat, 11/29/2025 - 05:12

ఇంటర్‌ విద్య.. పరీక్షలు ప్రహసనంలా మారుతున్నాయి. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దేలా ఏ మాత్రం చొరవ చూపలేకపోతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఈ ఉదంతాలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి ఇందులో రికార్డులు రాయడాన్ని పెద్ద ప్రాజెక్టుగా గతంలో భావించేవారు. దీంతో సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని సాధించేవారు. 

అయితే ప్రస్తుతం రికార్డులు అనే అర్థాన్నే సమూలంగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన రికార్డులు రాసేందుకు నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డులు వెలియడం గమనార్హం. మరికొందరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి.. సోషల్‌ మీడియాలో ప్రచారాలు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. 

నెల్లూరు(టౌన్‌): విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేది ఇంటర్‌ విద్యే. ఇందులో ఎంత బాగా చదివి.. అంత బాగా విద్యను ఆకళింపు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులభమవుతుంది. అయితే ప్రస్తుతం మార్కులు.. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. రోజుకో రకంగా వ్యవహరిస్తూ తమ సంస్థల పేరు ప్రతిష్టలు పెంచుకునేందుకే పెద్దపీటేస్తున్నాయి. 

బయటే రాయించుకోండి..! 
ఇంటర్‌లో పాఠ్యాంశాలను చదవడం ఓ ఎత్తయితే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బోటనీ.. జువాలజీకి సంబంధించిన రికార్డులు రాయాల్సి ఉండటం మరో చాలెంజ్‌. దీని ద్వారా సదరు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఈ వ్యవహారం పక్కాగా సాగేది. 

అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ తీరును మార్చుకుంటున్నాయి. రికార్డులను బయటే రాయించుకోవాలంటూ వీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో వీటిని రాసే దుకాణాలు, వ్యక్తుల వద్దకు విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. 

రసాయనాలా.. అంటే..? 
ప్రాక్టికల్స్‌లో ఏయే రసాయనాలు ఉంటాయనే అంశం చాలా మంది విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఏదో ఒక తరహాలో ప్రలోభాలు పెట్టి మార్కులేయించ్చొనే ధీమాతో థియరీపైనే యాజమాన్యాలూ దృష్టి సారిస్తున్నాయి. నైపుణ్యాలు, విలువలతో కూడి విద్యను విస్మరించి.. బట్టీ కొట్టుడు విధానాలకే జై కొడుతున్నాయి. 

ఇదీ పరిస్థితి.. 
నెల్లూరు జిల్లాలో 185 జూనియర్‌ కళాశాలలుండగా.. కార్పొరేట్, ప్రైవేట్‌కు సంబంధించనవే 119 ఉన్నాయి. ఇందులో ఎంపీసీకి సంబంధించి 18 వేలు.. బైపీసీ చదువుతున్న వారు ఏడు వేల మంది ఉన్నారు. మరోవైపు ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి ఒకటి నుంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రికార్డులను డిసెంబర్‌ నెలాఖరులోపు అందజేయాల్సి ఉంది. 

ప్రాక్టికల్స్‌లో రికార్డులనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫిజిక్స్‌లో 20.. కెమిస్ట్రీలో 35.. బోటనీలో 65.. జువాలజీలో 50 ప్రయోగాలకు సంబంధించి రికార్డులు రాయాల్సి ఉంది. అయితే బయట ఎవరితోనైనా రాయించుకోవాలంటూ యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సైతం దానికే మొగ్గు చూపాల్సి వస్తోంది. 

యాజమాన్యాల అదనపు వసూళ్లు 
కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రాక్టికల్స్‌ పేరుతో విద్యార్థుల వద్ద రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నాయి. రికార్డులెవరు రాసినా.. సక్రమంగా లేకపోయినా.. ప్రాక్టికల్స్‌లో మార్కులేయించేందుకు ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని బహి రంగంగానే చెప్తున్నారు.  

ముడుపుల మత్తులో జోగుతూ.. 
కార్పొరేట్‌ యాజమాన్యాల ఆగడాలు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులకు తెలిసినా, వారి నుంచి ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఏ కార్పొరేట్‌ కళాశాలలోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ క్లాసులను నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం తెలిసినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఒక్కో దానికి.. ఒక్కో రేటు 
ఈ వ్యవహారాల నడుమ రికార్డులు రాసేందుకు గానూ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. సబ్జెక్టుల వారీగా ధరనూ నిర్ణయించారు. 

ఫిజిక్స్‌కు రూ.780 నుంచి రూ.800.. 
కెమిస్ట్రీకి రూ.820 నుంచి రూ.900.. 
బోటనీకి రూ.880 నుంచి రూ.900.. 
జువాలజీకి రూ.920 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రికార్డుల్లో పొందుపర్చాల్సినవన్నీ తమ బాధ్యతేననీ చెప్తున్నారు. దీనికి గానూ అడ్వాన్స్‌ను ముందే పుచ్చుకుంటున్నారు. వీటిని వారం, పది రోజుల్లో పూర్తి చేస్తున్నారు.  

మా దృష్టికొచ్చింది 
రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. ఆయా కళాశాలల నుంచి కొన్ని రికార్డులను తెప్పించి పరిశీలిస్తా. వీటిని విద్యార్థులే  రాయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని యాజమా­న్యా­లు ప్రోత్సహించకూడదు. ప్రతి కళాశాలలో ప్రాక్టికల్స్‌ తరగతులను నిర్వహించేలా చర్యలు చేపట్టాం.   – వరప్రసాద్‌రావు, ఆర్‌ఐఓ  

ఇదే అంశమై వెలసిన బోర్డులు
నెల్లూరుజిల్లాలో ఇలా.. 
జూనియర్‌ కళాశాలలు 185 
విద్యార్థులు 30 వేల మందికిపైగా 
ఎంపీసీ, బైపీసీ 25 వేల మంది 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)