Breaking News

ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి అంతర్‌ జిల్లా దొంగ పరార్‌

Published on Sun, 08/17/2025 - 05:49

ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్‌ రఫీ అనే అంతర్‌ జిల్లా దొంగ,  వైఎస్సార్‌ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్‌ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం. 

తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్‌ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని  జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు.  శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 

సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్‌ అమర్‌ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్‌ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్‌  బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్‌ జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించి..  నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్‌ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది.  ప్రహరీ చుట్టూ విద్యుత్‌ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)