Breaking News

సాక్షి ఎఫెక్ట్: సింహాచలం ఆలయంలో తనిఖీలు

Published on Sun, 08/10/2025 - 11:34

సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో విచారణ కమిటీ పరిశీలన కొనసాగుతోంది.  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి చెందిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలను దేవదాయశాఖ, రాజమహేంద్రవరం ఆర్‌జేసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శనివారం ప్రారంభించింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.

రికార్డ్ మెయిన్‌టైన్‌ చేయకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆలయ ఉద్యోగుల నుంచి పలు వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి  గతేడాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న వివరాలకు, వాస్తవంగా ఉన్న ఆభరణాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యా దుపై దేవదాయశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి 17 నుంచి నెలరోజుల పాటు రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మరింత లోతుగా తనిఖీలు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం రాజమండ్రి ఆర్‌జేసీగా కూడా విధులు నిర్వహిస్తున్న సింహాచలం ఇన్‌చార్జి ఈవో త్రినాథరావు చొరవతో ఈ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా బండాగారంలోని ఆభరణాలు, వస్తువులను వాటి రికార్డులతో సరిపోల్చి బరువులు తనిఖీ చేశారు.

ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్‌ కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్, జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్‌.ప్రసాద్, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్‌జేసీ కార్యాలయం సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయని, పూర్తి నివేదికను సమరి్పస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో అర్చకుల ఆ«దీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)