వామ్మో.. పంటంతా తినేస్తున్నాయ్!

Published on Sat, 12/14/2024 - 05:42

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో వరి చేలను కత్తెర, కొమ్ము పురుగులు రైతుల పాలిట అశనిపాతంలా తయారయ్యాయి. నివారణ చర్యలు చేపట్టేలోగా చేలను చుట్టేసి కేవలం మూడు రోజుల్లోనే వరి కంకులను తినేస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఆ మూడు జిల్లాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 10లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యా­యి. ఈ దశలో కత్తెర, కొమ్ము పురుగులు విజృంభిస్తూ పంటను తినేస్తున్నాయి. పురుగులు ఆశించిన పొలాల్లో 30నుంచి 80 శాతం పంట పూర్తిగా దెబ్బతింది. నీటిఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగుల దాడి తీవ్రంగా కనిపిస్తోంది. 

విజయనగరం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట ఈ పురుగుల ఉ«ధృతితో దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. జామి, గంట్యాడ, గరివిడి, నెల్లిమర్ల, గజపతినగరం, బొండపల్లి, పూసపాటిరేగ, చీపురుపల్లి మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.  

పంటకు నిప్పు పెడుతున్న రైతులు
విజయనగరం జిల్లా బుడతనాపల్లిలో పురుగు సోకడంతో 75 ఎకరాల్లో వరి పంట గడ్డిలా తెల్లబారిపోవడంతో కోసేందుకు పనికిరాకుండా పోయింది. దీంతో చేసేది లేక  ఈ ప్రాంత రైతులు వరి పొలాలకు నిప్పు పెడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం ఎస్‌.నర్సాపురం పరిసర గ్రామాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూడా కత్తెర పురుగు వ్యాపిస్తున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, స్థానిక వ్యవసాయాధికారులకు చెప్పినా తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఇలాంటి పురుగులు, తెగుళ్లు సోకినప్పుడు శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి సామూహిక నివారణ చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు.

ఏడెకరాల పంటను మూడు రోజుల్లో తినేశాయి 
7 ఎకరాలను కౌలుకు తీసుకుని ఎంటీయూ–1126 రకం వరి వేశాను. ఎకరాకు 40 బస్తాలకుపైగా దిగుబడి వస్తుందని ఆశించాను. పంట కోత కొచి్చన వేళ ఉన్నట్టుండి కత్తెర, కొమ్ము పురుగులు విరుచుకుపడ్డాయి. కేవలం మూడే మూడు రోజుల్లో 7 ఎకరాల పంటను పూర్తిగా తినేశాయి.. ఎకరాకు రూ.35వేల చొప్పున అప్పు చేసి పెట్టిన రూ.2.50 లక్షలు ఆవిరైపోయాయి. ఏం చేసేది లేక పంటకు నిప్పు పెట్టాను. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – చల్లా రామునాయుడు, బుడతానాపల్లి, విజయనగరం జిల్లా

నష్టపరిహారం చెల్లించాలి 
యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతాలకు శాస్త్రవేత్తలను పంపించి వరి పంటను ఆశి­స్తు­న్న పురుగులను పరి­శీలించి డ్రోన్ల సాయంతో సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురు­గుల ఉధృతి కారణంగా ఉత్తరాంధ్రలో కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో 30 శాతానికి పంట దెబ్బతింది. నష్టపోయిన రైతులకు ప్రకృతి విపత్తుల కింద పంట నష్టపరిహారం ఇవ్వాలి. –  ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)