Breaking News

మిత్రుడికి ముప్పు! 

Published on Thu, 03/30/2023 - 04:41

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీటకాల పాత్ర కీలకం. మానవాళి కంటే దాదాపు 17 రెట్లు అధికంగా ఉండే కీటకాల జనాభా ప్రస్తుతం ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కీటక జాతులు తగ్గిపోతున్నాయని, మూడో వంతు అంతరించిపోతున్నట్లు బయోలాజికల్‌ కన్జర్వేషన్‌ నివేదిక వెల్లడిస్తోంది. జనావాసాల పెరుగుదల, విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువుల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీన్ని ‘కీటకాల అపోకలిప్స్‌’గా అభివర్ణిస్తున్నారు. 

ఆహార చక్రంలో ఎంతో కీలకం
ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్‌ జాతుల కీటకాలు ఉన్నట్లు అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం ఒక మిలియన్‌ జాతులను మాత్రమే గుర్తించారు. భూమిపై జంతు జాలంలో 80 శాతం కీటకాలే ఉండటం గమనార్హం. ఆహార పంటల పరాగ సంపర్కంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్‌ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని కీటకాలు కాపాడుతున్నాయి.

ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న 2.50 లక్షల రకాల పుష్పించే మొక్కలను పరాగ సంపర్కం చేయడంలో లక్ష కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర కీలకం. ఇందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు, బీటిల్స్‌ లాంటివి ఉన్నాయి. ఆహార చక్రంలో కీలక పాత్ర పోషించే కీటకాలు ఒక్క అమెరికాలోనే ఏటా 70 బిలియన్‌ డాలర్ల విలువైన సేవలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏటా 1–2 శాతం క్షీణత..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 నుంచి 2 శాతం కీటకాలు నశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాల కంటే కీటకాలు  అంతరించిపోయే రేటు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కీటకాల సంఖ్య క్షీణిస్తే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 శాతం ఆహార పంటలకు పరాగ సంపర్క­మే ఆధారం కావడం కీటకాల మనుగడ ఆవశ్యకతను సూచిస్తోంది. 

♦ మానవులు దాదాపు 2 వేల కీటకాలను ఆహారంగా భుజిస్తారు.
♦ 75 శాతం కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో ఆహార చక్రాన్ని పరిరక్షిస్తాయి.
♦  దీని విలువ ఏటా 577 బిలియన్ల డాలర్లు ఉంటుంది.
♦  ప్రకృతిలో దాదాపు 80 శా>తం అడవి మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడతాయి. 
♦ గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటక జాతులు అంతరించాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)